గూడెంలో కార్తీక శోభతో ముస్తాబైన ఆలయం
దండేపల్లి రెండో అన్నవరంగా ప్రఖ్యాతి గాంచిన గేడెంలోని శ్రీసత్య నారాయణ స్వామి దేవస్థానం తెలంగాణకే తలమానికంగా నిలిచింది దినదినాభివృద్థి చెందుతూ దేవస్తానం భక్తుల ఆదరణ పొందుతోంది తెలంగాణలో భక్తులు కోర్కెలు తీర్చేఆలయంగా ప్రసిద్థి చెందింది దేవస్థానం ఆలయం వద్ద కార్తీకమాసం మొదలుకొని నెలంతా భక్తుతో సందడి నెలకొంది దేవాలయంలో నిత్యం స్వామి వారికి కుంకుమార్చన అభిషేకం సత్యనారాయణ ప్రతాలు జరుగుతుంటాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం
సత్యనారాయణస్వామి పవిత్ర గోదావరి తీరాన జాతీయ రహదారిని ఆనుకుని గూడెం గ్రామం పక్కన ఎతైన కొండ మీద ఉంది భక్తులకు సకల సౌకర్యంగా ఉన్న ఆలయం కావడంతో కార్తీక పౌర్ణమి మొదలు ప్రతీరోజు వేలాది మంది భక్తులతో దేవస్థానం కిటకిటలాడుతోంది ఆలయం పక్కనే గోదావరి ప్రవహిస్తుండటంతో భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ నిత్యం వందలాది భక్తులు వస్తుంటారు.