గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరం — ఎమ్మెల్యే కిశోర్ కుమార్

మోత్కూరు సెప్టెంబర్ 25 జనం సాక్షి : పేదింటి వారి ఇంటి నిర్మాణ కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని పరకాల శాసనసభ్యులు తుంగతుర్తి గాదరి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ అన్నారు. సోమవారం మోత్కూరు మున్సిపాలిటీ , మండ లంలోని గృహలక్ష్మి లబ్ధిదారు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతున్నదని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరంగా మారెందని, సీఎం కేసీఆర్ నిరుపేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపాం దించినట్లు తెలిపారు. ఖాళీ స్థలం ఉండి ఇళ్లు లేని అర్హులైన నిరుపేద లందరికి ఈ పథకం కింద రూ. 3 లక్షలు అందించేందుకు ప్రభుత్వం అందజేస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మొదటి విడతలో లబ్ధి దారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను అందజేస్తామని త్వరలోనే మరో విడతలో మరింత మంది లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ తిపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య,
ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మి నరసింహ రెడ్డి, జెడ్పీటీసీ గొరుపల్లి శారద,సింగిల్ విండో చైర్మన్ కంచెర్ల అశోక్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షు డు కొండ సోమల్లు, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్, మండల అధ్యక్షులు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, పొన్నెబోయిన రమేష్,కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు