గెలిచేవాళ్లమా: గంభీర్ అసహనం, నరైన్‌పై గంగూలీ
కోల్‌కతా: తమ స్పిన్నర్లకు అనుకూలించే విధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మందకోడి పిచ్‌లను తయారు చేసుకుంటుందన్న ఆరోపణలను ఆ జట్టు సారథి గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. అన్ని విభాగాల్లో తాము నిలకడగా రాణిస్తున్నామని చెప్పాడు. తమ జట్టు మూడేళ్లలో రెండుసార్లు టైటిల్ గెలిచిందని గుర్తు చేశాడు. తాము స్పిన్నర్ప పైనే ఆధారపడినప్పటికీ తమ బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉందని చెప్పాడు. కోల్‌కతా మందకోడి పిచ్‌లు తయారు చేసి విజయాలు సాధిస్తుందని కొందరు అంటున్నారని, కేవలం మందకోడి పిచ్ పైన ఆడటం ద్వారా ఏ జట్టు రెండు టైటిళ్లు గెలవదన్నాడు. Gautam Gambhir పెద్ద టోర్నీల్లో నెగ్గాలంటే ఏ ఒక్కటో సరిపోదని అభిప్రాయపడ్డాడు. నిలకడగా ఆడాలని, తాము అదే చేశామని చెప్పాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు అందరికీ ఉపయోగపడతాయన్నాడు. బ్యాటింగ్ అనుకూల పిచ్ పైన బాగా రాణించేందుకు తమకు మంచి బ్యాట్సుమెన్ ఉన్నారని చెప్పాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచులో ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా స్పందిస్తుందో ముందే ఊహించడం కష్టమని చెప్పాడు. సునీల్ నరైన్ బ్యాకప్ స్పిన్నర్ అవసరం లేదని అభిప్పాయపడ్డాడు. సునీల్ నరైన్ మ్యాన్ ఆఫ్ ది ఐపీఎల్ అని సౌరవ్ గంగూలీ అన్నాడు.