గేల్, నేను ఆడతాం: కోహ్లీ, టీ20లే సులువు: ఇషాంత్
ముంబై: క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, తాను ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడతామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ క్రికెటర్లతో కళకళలాడుతున్న బెంగళూరు బ్యాటింగ్ లైనప్ ఐపీఎల్-8లో తప్పకుండా విజృంభిస్తుందన్నాడు. డారెన్ సామి, బద్రీనాథ్, దినేశ్ కార్తీక్ రాకతో జట్టు బ్యాటింగ్ బలం మరింత పెరిగిందన్నాడు. గత మూడు, నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ సీజన్ మాకు చాలా భిన్నంగా ఉండనుందన్నాడు. అప్పుడు చాలా ఒత్తిడిలో బ్యాటింగ్ చేశామని, ఈసారి తమ లైనప్ బలంగా మారిందన్నాడు. Virat Kohli: Gayle, AB and I can bat freely ఒకసారి ఐపీఎల్ ఫైనల్, మరోసారి చాంపియన్స్ లీగ్ ఫైనల్ చేరుకున్నామని, ఈసారి ఆ దశను విజయవంతంగా దాటుతామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. టీ20లు సులువు వన్డేల్లో బౌలింగ్ చేయడం కంటే టీ20ల్లో బంతులేయడమే తేలక అని సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. పేసర్లకు వన్డేల కన్నా టీ20లలో బౌలింగ్ చేయడం సులువన్నాడు. టీ20ల్లో అంతర వృత్తం అవతల ఐదుగురు ఫీల్డర్లు ఉండటం బౌలర్లకు ఉపశమనం అన్నాడు. దీనివల్ల బౌలర్లు స్వేచ్ఛగా బంతులేసే అవకాశముంటుందన్నాడు.