గొర్రెలు మరియు మేకలలో ఉచిత ఆరోగ్య వైద్య శిభిరం
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 6 :: గొర్రెలు మేకలకు సీజనల్ వ్యాధులు పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా పరిషత్ అధికారి వెంకటయ్య పేర్కొన్నారు తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని పడాలపల్లి గ్రామం లో ఉచిత వైద్య శిభిరం ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు ప్రాథమిక పశువైద్య కేంద్రం తూప్రాన్ ఆధ్వర్యంలో నిర్వహించి గొర్రె కాపరులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు వర్షాకాలం లో వచ్చే సీజనల్ వ్యాధులు గొర్రె కాపరులకి నష్టం కలిగిస్థాయి మూతి పుండ్లు, కాలి కుంట్లు,జ్వరం, న్యుమోనియా, జీర్ణకోశం సంబందించిన వ్యాధులు ప్రబలి జీవాలకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంద అన్నారు ప్రతి గ్రామం లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
గొర్రెలు మరియు మేకలలో పారుడు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ఏర్పాటు చేసి 1700 జీవాలు టీకాల వేయడం జరిగిందని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు ఈ యొక్క కార్యక్రమం ను గొర్రె కాపరులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.
ఆవులు మరియు ఎద్దులలో లంపి స్కిన్ అనే వ్యాధి ఒక పశువు నుండి ఇంకో పశువుకు సోకి పశువుల చర్మం పై దద్దుర్లు ఏర్పడి తీవ్ర అస్వస్థతకు గురి అయి పశువులు మరణిస్తాయి ఏదైనా గ్రామం లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పశువైద్య శాలని సంప్రదించి వ్యాధి సోకిన వాటికి చికిత్స చేయించుకోవాలని ఆరోగ్యమైన పశువులకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్ గౌడ్ గారు గొర్రె కాపురుల సంఘం మెదక్ జిల్లా డైరెక్టర్ మల్లేష్ యాదవ్ గారు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సుదర్శన్ పాణి,వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ లింగమూర్తి, మల్లేష్ మరియు గొర్రె కాపరులు పాల్గొన్నారు