గోదావరిఖనిలో వడగళ్లవాన
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో వాడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దాదాపు అరగంట పాటు కురిసిన వానతో రహదారులు పొంగిపొర్లాయి. వీధులు జలమయమయ్యాయి. పలు పంటలకు అపారనష్టం సంభవించింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.