గోదావరి ముప్పు ప్రాంతాలను పర్యటించిన జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

ములుగు జిల్లా
ఏటూర్ నాగారం జూలై 13( జనం సాక్షి ):-
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎటునాగరం చుట్టుపక్కల మండలాలలో లోతట్టు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులకు కలియతిరుగుతూ గోదావరి పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రజలకు భరోసా కల్పిస్తూ కొంత మంది ఇళ్లు కూలిపోయిన వ్యక్తులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని టిఆర్ఎస్ నాయకులు అన్ని ముప్పు  ప్రాంతాలలో ప్రజల కష్టాలను పంచుకుంటున్నారని పాత మట్టి గోడల ఇంట్లో ఉండకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలలో వసతి కల్పిస్తున్నామని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు గోదావరి పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఎవరు కూడా వెళ్లొద్దని అలాగే కొండాయి దొడ్ల మల్యాల రోడ్డుకు ఇరువైపులా పడిఉన్న చెట్లను స్వయంగా జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ తీసివేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిదులు
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,
మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్
రామన్నగూడెం ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్
సర్పంచ్ దొడ్డ కృష్ణ , తదితర నాయకులు పాల్గొన్నారు.