గోరఖ్‌పూర్‌ రైలు బోగీ కింద మంటలు

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎర్నాకుళంనుంచి బరౌని వెళ్తున్న గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ కింద చక్రానికి బ్రేకు లైనర్‌ పట్టుకోవటంతో శనివారం ఉదయం మంటలు  లేచాయి. రైలే రైల్వేస్టేషన్‌ దాటుతుండగా బోగీ కింద నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రైలును రామగుండం రైల్వేస్టేషన్‌లో 10 నిమిషాలపాటు నిలిపారు. స్థానిక రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టిన అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.