గ్యాస్ ధరలు పెంచడం దారుణం
` ప్రధాని మోడీపై మండిపడ్డ రాహుల్
న్యూఢల్లీి,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 పెంచిన నేపథ్యంలో ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయని దుయ్యబట్టారు. ªూహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, ద్రవ్యోల్బణం ఎగబాకడంతో, ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయి అని ఎద్దేవా చేశారు. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.100.50 పెంచుతున్నట్లు నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఢల్లీిలో దీని ధర రూ.2,101కి చేరింది. నవంబరు 1న కూడా ఈ సిలిండర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. తాజా పెరుగుదల తర్వాత ప్రధాన నగరాల్లో కమర్షియల్ 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను పరిశీలించినపుడు, ఢల్లీిలో రూ.2,101Ñ ముంబైలో రూ.2,051Ñ కోల్‌కతాలో రూ.2,174.50Ñ చెన్నైలో రూ.2,234.50కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. నవంబరు 1న ప్రతి కమర్షియల్ ఎల్పీజీ 19 కేజీల సిలిండర్‌పైనా రూ.266 పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచలేదు. ఇదిలావుండగా, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అత్యధిక ద్రవ్యోల్బణం రేటు, వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై చర్చ జరపాలని కోరారు.