గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి
ఏలూరు,సెప్టెంబర్1(జనం సాక్షి ): పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం చిక్కాల గ్రామంలో శనివారం గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాన్ని మంత్రి జవహర్ ప్రారంభించారు. ప్రస్తుతం చిక్కాల గ్రామ జనం మధ్య గ్రామదర్శిని కొనసాగుతోంది. మంత్రి జవహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడంతో ప్రజలు టిడిపి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కోరుకుంటారని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు చంద్రబాబు నిరంతరం పని చేస్తుంటే వైసిపి నాయకులు టిడిపిని విమర్శించటం దారుణమన్నారు.