గ్రామాల్లో పారిశుద్ద్య పనుల పరిశీలన
ఏలూరు,సెప్టెంబర్24(జనంసాక్షి): జిల్లాలో దోమలవ్యాప్తిని అరికట్టేందుకు వైద్యబృందాలు రంగోలకి దిగాయి. నిల్వనీటి వద్ద ప్రత్యేక చర్యలు తీసుకుటంఉన్నాయి. గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పారిశుధ్య పనులను
పర్యవేక్షించారు. ఈ నెల 20వ తేదీ నుంచి అధికారులు గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించారు.మురుగునీటి నిల్వలు దోమల వ్యాప్తికి నిలయాలని వైద్యాధికారులు అన్నారు. పారిశుధ్య వారోత్సవాలు, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో భాగంగా దోమలపై దండయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కొబ్బరి బొండాలు, టైర్లు, పూలకుండీల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు ఎక్కువగా ఉంటాయని, తద్వారా ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. అనంతరం రక్షిత నీటి పథకం పనులను, పారిశుధ్యం పనులనుపరిశీలించారు. రక్షిత నీటి పథకం పనులను, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమంలో గ్రామాల్లో మురుగుకాలువలో పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు, తాగునీటి వనరుల సంరక్షణపై జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు ఏవిధంగా జరుగుతున్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.