గ్రామాల అభివృధి చేయడమే ప్రభుత్వ ద్వేయం

గ్రామాల అభివృధి చేయడమే ప్రభుత్వ ద్వేయం-ఇంజమూరి రాములు యాదవ్
-40 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం

 లింగాల జనం సాక్షి:-గ్రామాల అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం అని బిఆర్ఎస్ నాయకులు ఇంజమూరి రాములు యాదవ్ అన్నారు, శనివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామంలో గ్రామం సర్పంచ్ గుమ్మకొండ జంగమ్మ.తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చిన్నచిన్న గ్రామాలను కూడా గ్రామపంచాయతీలుగా మార్చి గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని వారు కొనియాడారు, గతంలో ఉమ్మడి గ్రామపంచాయతీ జిలుగుపల్లి ఉన్నప్పుడు , రేషన్ బియ్యంకు,పెన్షన్ అనేక ఇబ్బందులు పడుతూ కాలి నడకన వెళ్లి తెచ్చుకునే వాళ్ళము ఇపుడు ప్రస్తుతము మాకు జీ పీ గా ఏర్పాటు ఐనా తర్వత మా సమస్యలు పరిష్కారం అయవని తెలిపారు. అందులో భాగంగా దత్తారం గ్రామానికి సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లకు నిర్మాణానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని అట్టి నిధులతో గ్రామంలోని ప్రతి వాడవాడల మట్టి రోడ్ల ను, సిసి రోడ్లుగా వేసినట్లు వారు తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గుమ్మకొండ జంగమ్మ. ఉప్ప సర్పంచ్ అనురాధ. గ్రామ వార్డ్ సభ్యుల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఇంజమూరి రాములు యాదవ్, సహదేవ్ యాదవ్, హనుమంతు యాదవ్,బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్ గౌడ్ భూపతిరావు, రాజల్ రెడ్డి, కృష్ణ యాదవ్, శివుడు యాదవ్, సాయిలు, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.