గ్రామీణ క్రీడ ప్రాంగణాల తో క్రీడాకారులు తయారు *మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్

జనం సాక్షి) జూన్ 14 :: గ్రామీణ క్రీడా స్థలాల వలన గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించుకొని రాష్ట్రీయ జాతీయ క్రీడాకారులుగా తయారవుతారని మీ దగ్గరికి చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని ఇస్లాంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  ఏర్పాటు చేస్తున్న తెలంగాణ   క్రీడా ప్రాంగణం  ప్రారంభించి న తర్వాత ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులు తమ క్రీడలో నైపుణ్యం చూపించి మండల స్థాయి జిల్లా స్థాయి స్థాయి అవకాశాలు ఉన్నాయని అన్నారు సెల్ ఫోన్ లో ఆడడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆమె అన్నారు క్రీడ ప్రాంగణానికి చుట్టూ ప్రహరీ గోడ మంజూరు చేయాలని సర్పంచ్ సుకన్య రమేష్ జడ్పిటిసి సత్యనారాయణ గౌడ్ జెడ్పీ చైర్మన్ కోరగా ఆమె సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేస్తానని తెలిపారు ఆమె వాలీబాల్ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు  అనంతరం పల్లె ప్రకృతి వనం పరిశీలించి సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ అరుంధతి  జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ మండల టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు బాబుల్ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ మండల వ్యవసాయ అధికారి  గంగ మల్ల రెడ్డి ఎంపిటిసి నర్శవ్వ , రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి పాక్స్ డైరెక్టర్ రాజు,  సర్పంచ్ సుకన్య రమేష్  మరియు ఆత్మ కమిటీ సభ్యులు బిక్షపతి , బండి నరేందర్ గౌడ్ , సుధాకర్  గ్రామ పంచాయితీ పాలకవర్గం , ప్రజలు, ఉపాధ్యాయులు , విధ్యార్థులు పాల్గొన్నారు