గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించాలి
దిలవార్పూర్ : గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల పేద క్రీడాకారులను గుర్తించి తగు ప్రోత్సాహం ఇచ్చేందుకే ప్రభుత్వం పైకా క్రీడాలను ప్రవేశపెట్టిందని క్రీడల కన్వీనర్, ఎంపీడీఓ సరస్వతి తెలిపారు. శుక్రవారం దిలవార్పూర్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పైకా క్రీడలను ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దారు శంకర్‌గౌడ్, ఎంఈఓ శంకర్, నిర్మల్ ఎఫ్‌ఎన్‌సీఎన్ చైర్మన్ శ్రీనివాస్, నర్సాపూర్(జి) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్‌రావు తదితరులు పాల్గోన్నారు.