గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

;ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్ ఆగస్టు 07 ( జనంసాక్షి )
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతి అని కోదాడ అభివృద్ధి ప్రదాత,శాసనసభ్యులు  బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా ముత్యాలమ్మ గుడి లో ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ పండుగ నిర్వహించడం అనాదిగా వస్తుందని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకోవడంతో   గ్రామంలో ప్రజల ఆయురారోగ్యాలు పాడి,పంటలు కలుగుతాయని ప్రజల గట్టి విశ్వాసం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగల్లో భాగస్వామ్యం అయి ప్రజల నమ్మకాలకు విశ్వాసాలకు అండగా ఉంటుందన్నారు. ముత్యాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అన్నారు. ప్రజలు ముత్యాలమ్మ పండుగ ను ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలి అన్నారు. ముత్యాలమ్మ పండుగ మరియు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,  టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు ఖదీర్,కోట మధు,మైస రమేష్,చందర్రావు, ఒంటి పులి శ్రీనివాస్,కాజా,బెజవాడ శ్రవణ్,చింతల్ నాగేశ్వరరావు,సాదిక్,బత్తుల ఉపేందర్,గంధం పాండు,వంశీ,ఆలయ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.