రియో డి జనీరో: మహిళల పోలోవాల్ట్ స్వర్ణాన్ని గ్రీస్ ఎగరేసేకుపోయింది. ఆ దేశానికి చెందిన క్రీడాకారిణి స్టీఫెన్డీ అమెరికాకు చెందిన శాండీ మిర్రర్‌తో తలపడి స్వర్ణాన్ని అందుకుంది. వీరిద్దరు 4.85 మీటర్ల లక్ష్యాన్ని అలవోకగా దాటారు. కానీ శాండీ ..బార్‌ను కొంచెం తాకడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టీఫెన్డీ కచ్చితంగా లక్ష్యాన్ని దాటండంతో స్వర్ణాన్ని సాధించింది. న్యూజిలాండ్‌కు చెందిన ఎలీజా 4.80మీటర్లు లక్ష్యాన్ని దాటి కాంస్యాన్ని దక్కించుకుంది.