గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష కొరకు అభ్యర్థులు హాల్ టికెట్స్ త్వరితగతిన డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ బుధవారం ప్రకటనలో సూచించారు.సూర్యాపేటలో 31 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు  9,181మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు తెలిపారు.సుమారుగా 5 వేల మంది అభ్యర్థులు మాత్రమే హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.మిగిలిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా tspsc.gov.in వెబ్  సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సందేహాలను  6281492368 నెంబర్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు.
Attachments area