గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, (ఏప్రిల్2): ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానాన్ని తెలుసుకునేందుకు కేసీఆర్ మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో తన చాంబర్లో గురువారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. సంక్షేమ పథకాల అమలు, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సీఎం వారితో చర్చించారు.