ఘట్కేసర్‌ మండల ఎంపిటిసిల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
మహాత్మగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేత

మేడ్చల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): ఘట్కేసర్‌ మండలంలోని ఎంపీటీసీలు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు గాను, 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో అధికార పార్టీకి చెందిన ఏనుగు సుదర్శన్‌ రెడ్డి ఔషపూర్‌ కు ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రోజు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేశారు. నిధులు లేని ఎంపీటీసీ వ్యవస్థను వెంటనె రద్దు చేయాలి అని అన్నారు. మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏనుగు సుదర్శన రెడ్డి మాట్లాడుతూ.. గెలిచి మూడు ఏండ్లు అయిన మా ఎంపీటీసీ వ్యవస్థ నుండి గ్రామాలకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని అన్నారు. మా ఎమ్మెల్యే అయిన మంత్రి మాల్లారెడ్డికి ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మా మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గనికి రావాల్సిన నిధులు వేరే జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్లిస్తుంది అని ఆరోపించారు. బీజేపీ ఎంపీటీసీ కొమ్మిడి శోభ రెడ్డి మాట్లాడుతూ.. కనీసం మాకు గ్రామలల్లో ప్రజలు మర్యాద కూడా ఇవ్వడం లేదు అని అన్నారు. గ్రామంలో ఒక్క విధి లైట్‌ పోయింది అని ప్రజలు చెపితే వీధి లైట్‌ వేయించని అధికారం మాకు ఎందుకని అన్నారు. గ్రామా పంచాయతీలో కనీసం ఎంపీటీసీలకు కుర్చీ కూడా లేదని వెల్లడిరచారు. అన్ని గ్రామాల ఎంపీటీసీలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా త్వరలో ఎంపీటీసీ వ్యవస్థకు రాజీనామా చేస్తామని
తెలపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మా ఎంపిటీసీలకు నిధులు ఇవ్వాలని.. లేదా మా వ్యవస్థను రద్దు అయినా చేయండని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ రవి మాట్లాడుతూ.. నేను గతంలో వార్డు మెంబెర్‌ ఉండి 5 ఏండ్లలో 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయించను అన్నారు. కానీ ఇప్పుడు ఎంపీటీసీగా గెలిచి గ్రామంలో ఒక్క రూపాయి పని కూడా చేయలేదని చెప్పారు. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయమని ఎలా అడుగుతామని వ్యాఖ్యానించారు. ఇలానే పోతే పార్టీకి చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు భాస్కర్‌ రెడ్డి, గట్టగళ్ల రవి, కోమ్మిడి శోభారాణి, నీరుడి రామారావు, బొడ్డు వినోద, ఔషపూర్‌ సర్పంచ్‌ ఏనుగు కావేరి మచ్చేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.