ఘనంగామైనార్టీ వెల్ఫేర్ స్కూల్ వ్యవస్థాపక దినోత్సవం

జాతీయ విద్యా దినోత్సవం,మౌలానా అబుల్ కలాం ఆజాద్ 134వ జన్మదినోత్సవ వేడుకలు

కురవి నవంబర్-11 (జనం సాక్షి న్యూస్)

కురవి మండల కేంద్రములోని మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల పరిషత్ అధ్యక్షురాలు గుగులోత్ పద్మావతి రవినాయక్.ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ భారత దేశ మొదటి విధ్యాశాఖామాత్యులు అబుల్ కలాం ఆజాద్ జన్మదినమే నేటి విధ్యా దినోత్సవం అని అన్నారు.అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షరం అజ్ఞానాన్ని తొలగిస్తుంది దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాట సారి మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ గారనిఅన్నారు.ప్రాథమిక విధ్య ప్రతి మనిషి జన్మహక్కు.సమాజంలో విధ్యలేని మానవుని మనుగడ ప్రశ్నార్థకమే.వారి హయాంలోనే అనేక విధ్యాసంస్కరణలు చేసి నూతన శకానికి నాంది పలికారని, విద్యావ్యవస్థ పటిష్టతకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. తెలంగాణ జాతి పిత ముఖ్య మంత్రి కెసిఆర్ సారథ్యంలో యావత్ తెలంగాణ, శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ విశేషకృషితో డోర్నకల్ నియోజకవర్గం ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దారన్నారు.అవకాశాలను అందిపుచ్చుకుని, వాటిని సద్వినియోగం చేసుకుని,మహనీయులు చూపిన మార్గంను ఆదర్శంగా ఎంచుకుని భవిష్యత్తు కు బంగరు బాటలు వేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పద్మ నరసింహారావు , స్థానిక యంపిటిసి భాస్కర్,యంపిడిఓ సరస్వతి ,ప్రిన్సిపాల్ పుష్పజారెడ్డి,రఫి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.