ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):సూర్యాపేట మండలం బాలెంలలోని బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల , వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి
 అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలు జిల్లా బాలల పరిరక్షణ అధికారి  బి.రవికుమార్ అధ్యక్షతన జరిగాయి.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రశాంతి మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్ ఆలోచనలు ఉండాలన్నారు.నేడు ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ , ఐపీఎస్ , జడ్జీలు , డాక్టర్లలో కూడా గ్రామస్థాయి ,నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారున్నారని అన్నారు.అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ కోటా చలం మాట్లాడుతూ పిల్లల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గర్భస్థ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఆరోగ్య జాగ్రత్తలు గురించి వివరించారు.సిడబ్ల్యూసి చైర్మన్ బి.రమణరావు మాట్లాడుతూ పిల్లలకు అన్ని విధాల ఆదుకోవటానికి పిల్లల చట్టాలు బలంగా ఉన్నాయని తెలిపారు.సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లల సంరక్షణ, చదువు ప్రాముఖ్యత,ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించారు.బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల జరిగే అనర్ధాలు,నష్టాల గురించి చెప్పారు.అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడల విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు డిసిపియు, చైల్డ్ లైన్ , సఖి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail