ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 12( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లో సి.పి.ఐ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుందర్ పాల్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోత్ రామచందర్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ 1936 లక్నో లోని బెనారస్ యూనివర్సిటీలో భగత్ సింగ్ రాజ్ గురు సుద్దేవ్ ఆశయ సాధన కోసం అభివృద్ధి బక్రుద్దీన్ బాసు ప్రేమ్ నారాయణ్ భార్గవ్ల అధ్యక్షతన 1936 ఆగస్టు 12న ఆవిర్భవించినది. ఆనాటి నుండి భరతమాతను పరాయిపాలన నుండి విముక్తి కలిగించేందుకు వీరోచిత పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని, తెలంగాణ సాయుధ పోరాటంలో సైతం క్రియాశీలకంగా పనిచేసినటువంటి దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని చదువుతో పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో విద్యారంగ సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ముందుకు సాగిపోతు భావితరాల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, దేశ ప్రధానులుగా రాష్ట్రపతిగా మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టిన వారు ఏఐఎస్ఎఫ్ కు నాయకత్వం వహించిన వారిని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎజ్జు భాస్కర్, ఐత శ్రీరాములు,బండి వీరభద్రం,గుగులోత్ సోని, యువరాజు,అవంతిక,సాలోని,శిరీష నందిని తదితరులు పాల్గొన్నారు.