ఘనంగా కార్తీక మ‌హోత్స‌వ‌ వేడుకలు

 

విజయనగరం అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు

హాజరైన మంత్రి సుజయ కృష్ణ రంగారావు

విజయనగరం,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయనగరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పూలబగ్‌ ఫారెస్ట్‌లో శుక్రవారం కార్తీక  మ‌హోత్స‌వ‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజాయ్‌ కృష్ణ రంగారావు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, అధికారులు పాల్గొని చెట్టుకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపరులందరినీ అలరించాయి. అనంతరం మంత్రి సుజాయ్‌ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక వన మ¬త్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత

అధిక శాతం తాము మొక్కలను పెంచడం, అడవులు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని, అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చెట్లు పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. సహజ వనరులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే వాటి అభివృద్ధిలో జల హారతులు, కోటి మొక్కలు నాటడం, వనం మనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 50 శాతం భూముల్లో పచ్చదనాన్ని నింపడమే లక్ష్యంగా సిఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. పచ్చదనం పెంచే దిశలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, సామాజిక బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు, అడవులపై స్కూల్‌ స్థాయి నుండే అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసి మొక్కలు నాటిస్తున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో కోటి 70 లక్షలకు పైగా మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారని, దానిపై ఆడిట్‌ చేసి మరో కోటి మొక్కలు నాటుతామని మంత్రి సుజాయ్‌ కృష్ణ రంగారావు పేర్కొన్నారు. అనంతరం అడవుల సంరక్షణ పై ప్రతిజ్ఞ చేశారు. తర్వాత మంత్రి చేతుల విూదుగా విద్యార్థులలో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి నాయుడు, బబ్బిలి చిరంజీవి లు, ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్‌, కలెక్టర్‌ హరి జవహర్‌ లాల్‌, డిఎఫ్‌ఓ లు లక్ష్మణ్‌, జానకి రాం, పలువులు అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, గద్దె బాబూరావు, వాజి ఛానెల్‌ ఎండి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.