ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.

: కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మున్సిపల్ చైర్మన్.
బెల్లంపల్లి, సెప్టెంబర్27,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు గుజ్జ రవి, గెల్లి రాజలింగు, నాయకులు నెలికంటి శ్రీధర్, ఎలిగేటి శ్రీనివాస్, సముద్రాల మురళి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.