ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ’ వర్ధంతి
మహదేవపూర్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని, 1969 లో తొలి దశ పోరాటంలో కీలకపాత్ర పోషించి ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం త్యజించిన త్యాగశీలి అని , బాపూజీ తెలంగాణ ఉక్కు మనిషి అని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాబు అభివర్ణించారు. బుధవారం మహదేవపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సల్లా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ విశాలాంధ్రను తీవ్రంగా వ్యతిరేకించి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, నిజాం నవాబు నిరంకుశ పాలనపై అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. పద్మశాలి ఉద్యోగుల, వృత్తి కళాకారుల సంఘం కాటారం సబ్ డివిజన్ అధ్యక్షులు గాదె రమేష్ నేత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ.కోసం ఇలా మూడు దశల ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన తెలంగాణ ఉక్కుమనిషి అని ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ సేవలను కొనియాడారు. బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, పంతకాని రాజు, సంగం బాలయ్య, కాలేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ ఎనమండ్ర వామన్ రావు, నాయకులు అన్కారి ప్రభాకర్, పెండ్యాల మనోహర్, తుడిచెర్ల దుర్గయ్య , తదితరులు పాల్గొన్నారు