ఘనంగా జడ్పీటీసీ జన్మదిన వేడుకలు

కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి:జడ్పీటీసీ రణం జ్యోతి
దౌల్తాబాద్,జూన్ 30 జనం సాక్షి.
చిన్నప్పటినుంచే ఉత్తమ లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యసాధనకు కష్టపడి చదివి అందరూ మెచ్చే ఉన్నత స్థానానికి ఎదగాలని దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండలంలోని తన స్వంత గ్రామమైన గొడుగుపల్లి గ్రామ పాఠశాలలో తన పుట్టినరోజు సందర్భంగా 130 మంది విద్యార్థులకు సుమారు 6 వేల రూపాయల విలువైన నోట్ బుక్స్, పెన్నులు సామాగ్రిని గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని అన్నారు. పుట్టిన రోజున వారికి అవసరమగు నోట్ బుక్స్ అందించడం తృప్తి గా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు,పెండ్లి రోజు లలో ఆడంబరాలకు పోకుండా పేద విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను పెన్నులను, అందించి వారి ఔన్నత్యాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్,ఉప సర్పంచ్ బాబు,విద్యాకమిటి చైర్మన్ శంకర్,ప్రధానోపాధ్యాయులు పెద్ది కుమార్,ఉపాధ్యాయ బృందం,గ్రామ యువజన నాయకులు చింటు తదితరులు పాల్గొన్నారు.