ఘనంగా జీవవైవిధ్య దినోత్సవం
హైదరాబాద్ : జీవవైవిధ్య సూచీలో హైదరాబాద్ నగరం గత ఆరునెలల్లో 39 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు పెరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు వెల్లడించారు. అంతర్జాతీయ జీవివైవిధ్య దినోత్సవం హైదరాబాద్‌లోని ఇమ్లిబస్ పార్క్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణబాబు , నగర మేయర్ మాజిద్ హుస్సేస్, జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జీవవైవిధ్య సదస్సులో హామీ ఇచ్చిన విధంగా రాబోయే రోజుల్లో జంటనగరాల్లో 15 పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణబాబు తెలిపారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు జీహెచ్‌ఎంసీకి ప్రజలు, విద్యార్థులు అందరూ సహకరించాలని మేయర్ మాజిద్ కోరారు.