ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

 

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండలం ఏర్ధండి గ్రామంలో అఖిల భారత విద్యా పరిషత్తు ఆద్వర్యంలో శనివారం నాడు తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయులు జింధం గంగాధర్ హాజరై మాట్లాడారు.1947 భారత దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని , కానీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 రోజు నిజాం పాలన నుండి ఆనాటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో మిషన్ పోలో ద్వారా నిజాం రాజుల పై యుద్ధం చేసి తెలంగాణను భారత దేశం లో విలీనం చెయ్యడం జరిగిందని , ఎదరో త్యాగాల ఫలితమే ఈ మన తెలంగాణ అని , వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగాలని విద్యార్థులకు ,మార్గ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి జాయింట్ కన్వీనర్ గన్నారపు అమృత్ చారి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెట్‌పల్లి సహా కార్యవహా బట్టు నిరంజన్ , కల్లెడ శ్రీనివాస్, రాకేష్, అభితేజ,ఆదిత్య, రాజుకుమార్,దాసరి రాజేందర్, గాండ్ల రాజేందర్, గంగారెడ్డి , రాజుకుమార్, యోగేష్, విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.