ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తూప్రాన్ (జనం సాక్షి) జూన్ 13::

: తూప్రాన్ మండలం తాతబపాన్ పల్లి గ్రామం లో పోచమ్మ  తల్లి దేవి ప్రతిష్ట మహోత్సవాలు వేదోక్తంగా పూర్తయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుండి ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి, గ్రామంలో గ్రామదేవతగా విరాజిల్లుతు పూజలందుకుంటున్న పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రతిష్ట సంకల్పము,  దీక్షాధారణ, భద్ర మంత్ర పఠనం, అఖండ దీపం, మాతృదేవత ఆహ్వానం, మండపారాధన, యాగశాల ప్రవేశం నిర్వహించి సాయంత్రం ప్రతిష్ట విగ్రహానికి జలాధివాసం  ఆదివాసము మంగళ హారతి మంత్రపుష్పం గావించారు. ఆదివారం స్థాపితం దేవత హోమం ఉదకశాంతి పారాయణము, మంత్రజపం తర్పణాలు అభిషేకము దేవతామూర్తులకు  విశేష వాసములు   దేవతామూర్తి కి జలది ఆదివాసము పుష్పాది వాసం, ఫలఆదివాసము,  గావించారు. సోమవారం ఉదయం  స్థాపిత విగ్రహానికి నానావిధ అభిషేకాలు గ్రామస్తుల చే నిర్వహింప చేసి యంత్ర విగ్రహ ప్రతిష్ట గావించారు. అనంతరం  పోచమ్మ తల్లి కళ్యాణం ఓడి బియ్యం సమర్పణ గావించారు. గ్రామస్తులు విశేషంగా తరలి వచ్చి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పోచమ్మ తల్లి కృపకు పాత్రులయ్యారు