ఘనంగా ప్రపంచ ఫార్మసీస్ట్ డే వేడుకలు….

నాగార్ కర్నూల్ ఆర్సీ సెప్టెంబర్ 25(జనంసాక్షి):జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోనీ కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రపంచ ఫార్మసీస్ట్ డే వేడుకలు తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సుధాకర్ లాల్ హాజరై వారు మాట్లాడుతూ,వైద్య ఆరోగ్య శాఖాలో ఫార్మసీస్ట్ ల పాత్ర అతిముఖ్యమైనదని,డాక్టర్ తర్వాత ఫార్మసీస్ట్ మాత్రమే రోగికి మందుల మీద అవగాహన కల్పించి,తగిన సూచనలు ఇస్తారని తెలిపారు.ఫార్మసీస్ట్ ఆసుపత్రికి వెన్నుముక అని ఫార్మసీస్ట్ సేవలను ప్రశంసించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ ఔషది కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నాగర్ కర్నూల్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని,కొవిద్ సమయంలో మీరు అందించిన సేవలు అద్బుతం అని ఈ సంద్భంగా ఫార్మసీస్ట్ ల సేవలను కొనియాడారు.ఈ సంద్భంగా ఫార్మసీస్ట్ లందరికీ ఫార్మసీస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ సంద్భంగా ఫార్మసీస్ట్ లందరికీ ఫార్మసీస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డా.ప్రదీప్,రెనయ్య, జిల్లా ప్రభుత్వ ఫార్మసీస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్,రెడ్ క్రాస్ సెక్రటరీ రమేష్ రెడ్డి,ఉప మలేరియా అధికారి ఆర్.శ్రీనివాసులు,అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసులు,వెంకటేశ్,బాలరాజు,డి.కుమార్,అశోక్ రెడ్డి,హన్మంతు,సంతోష్,రాజేష్,సాయిరాం,చంద్రమౌళి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.