ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
ఖానాపురం ఆగష్టు 19జనం సాక్షి
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం మండల కేంద్రంలో శుక్రవారం ఫోటోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. మండల ఫోటోగ్రాఫర్ల అధ్యక్షులు శ్యామ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగుర్రే చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు శ్యామ్ మాట్లాడుతూ. రోజు రోజు కు ఎంతో అధునాతన పరికరాలు వచ్చి మానవ మనుగడ చరిత్రను సజీవంగా ఉంచడానికి ఫోటోలు వీడియోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు.
లూయిస్ జాకస్ మండే డా డాగుర్రే సృష్టించిన కెమెరాలతో ప్రపంచానికి కొత్త ఆశలు అందించారు అన్నారు.ఇంతవరకు ఫోటో గ్రాఫర్ల జీవనం రాలేదు అన్నారు. ప్రభుత్వ పరంగా ఫోటోగ్రాఫర్లు ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కళ్లెపు రాజు, కోశాధికారి తూడి కోటి, ఉధ్యక్షులు నాగరాజు, సభ్యులు కుమార్,బిక్షపతి, రాజేందర్,యాకన్న, ఫరీద్, సాయి, సతీష్, రమేష్,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.