ఘనంగా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం
భూపాలపల్లి టౌన్ ఆగస్టు 19 (జనంసాక్షి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్లు బండ మోహన్ , పాలకుర్తి మధు, జాలిగపు రాజులకు 22వ వార్డు కౌన్సిలర్ ముంజల రవీందర్ కేకు కట్ చేపించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తవటం వెంకటేశ్వర్లు రాపర్తి జంపయ్య ప్రదీప్ గణేష్ మణిరత్నం శివకృష్ణ సాయి రేవంత్ తదితరులు పాల్గొన్నారు.