ఘనంగా ఫ్రీడం రన్ విజయవంతం

జాతీయ స్ఫూర్తిని నింపేల ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో ఫ్రీడమ్ రన్

వందలాదిగా పాల్గొన్న మండల వాసులు

 

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 11:
స్వాతంత్ర్యo వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వజ్రోత్సవ వారోత్సవాలలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ హనుమాన్ టెంపుల్ నుండి చిగురుమామిడి బస్టాండ్ లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఫ్రీడం రన్ ను మండల ప్రభుత్వ శాఖల అధ్వర్యంలో సంయుక్తంగా గురువారం నిర్వహించారు. ఇందులో 2.5 కి.మి.ల ఫ్రీడమ్ రన్ ను స్థానిక ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా మండలంలోని మండల అధికారులు, సర్పంచులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ ప్రారంభం నుండి జాతీయ గీతాలతో,జాతీయ జెండాలతో ఉత్సాహంగా కొనసాగింది. ఫ్రీడమ్ రన్ లో మొదటి బహుమతి ఓగులాపూర్ గ్రామానికి చెందిన గుంటి సతీష్ గెలుపొందగా ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి తో పాటు తహశీల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్, ఎంపీడీవో ఎం.నర్సయ్య, ఎస్సై దాస.సుధాకర్ ప్రజాప్రతినిధులు తదితరులు శాలువాతో సన్మానించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ముగింపు సభలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజులపాటు రోజుకు ఒక కార్యక్రమం మండలంలో నిర్వహిస్తామని తెలిపారు. ఫ్రీడమ్ రన్ నిర్వహించడంలో చిగురుమామిడి పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ముగింపు వేదిక వద్దకు డార్విన్ స్కూల్ విద్యార్థులు భారతమాత, అంబేద్కర్, భగత్ సింగ్, నెహ్రూ వేశాదారణ తో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఫ్రీడమ్ రన్ లో మండల విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక వైద్యాధికారి నాగశేఖర్ మండల ఏపివో.సంపత్ సర్పంచ్ లు బెజ్జంకి లక్ష్మణ్, సన్నిళ్ళ వెంకటేష్, శ్రీముర్తి రమేష్ , బోయిని శ్రీనివాస్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ లు తిరుపతి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి,సి హెచ్ తిరుపతి వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అందే స్వామి, నాగెల్లి లక్ష్మారెడ్డి, సర్వర్ పాషా, చెప్యాల.శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, పొన్న శ్రీను, బోయిని వంశీతో పాటు మండలంలోని యువకులు, అధికారులు,పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.