ఘనంగా భారత స్వతంత్ర వజ్రోత్సవ ర్యాలీ
గుండాల, ఆగస్టు13(జనంసాక్షి); గుండాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీని ప్రారంభించి త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని జాతీయ గీతలు అలపిస్తూ స్వతంత్ర సమరంలో అమరులైన వీరులకు ర్యాలీ లో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గుండాల సీఐ కరుణాకర్ మాట్లాడుతూ మనం ఇప్పుడు స్వేచ్ఛ గా జీవిస్తున్నామంటే దానికి కారణం స్వతంత్ర సమరయోధుల పోరాటమే కావున ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా మెలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజశేఖర్ ,కానిస్టేబుల్స్, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం,సర్పంచ్ కోరం సీతారాములు, ఎంపీటీసీ సంధాని, హై స్కూల్,ప్రగతి విద్యాలయం విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.