ఘనంగా మంత్రి భూమా అఖిలప్రియ వివాహం

– భారీగా హాజరైన భూమన అభిమానులు

కర్నూల్‌, ఆగస్టు29(జ‌నం సాక్షి) : ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం ఘనంగా జరిగింది. బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రాల మధ్య.. సరిగ్గా బుధవారం ఉదయం 10.57 నిమిషాలకు అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌ల జంట వివాహ బంధంతో ఒక్కటయ్యింది. ఆళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టు వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. అలాగే అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అఖిల ప్రియ వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖలకుఆహ్వానం అందింది. గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబుతో పాటూ మంత్రులు కూడా హాజరుకావాల్సి ఉంది. కాని నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో విషాదం అలముకొంది. టీడీపీ నేతలు, నందమూరి అభిమానులు షాకయ్యారు. హరికృష్ణ పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండటంతో అందురూ అక్కడికి బయల్దేరారు. దీంతో అఖిలప్రియ వివాహానికి సీఎంతో పాటూ మంత్రులు, ముఖ్య నేతలెవరు హాజరుకాలేకపోయారు. మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త. రాయలసీమలో ఆయనకు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అఖిలప్రియ, భార్గవ్‌లు కొంతకాలంగా ప్రేమించుకొన్నారు.. తర్వాత వివాహం చేసుకొన్నారు.

 

తాజావార్తలు