– ఘనంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 7వ వార్షికోత్సవం, అంబులెన్స్ ఆవిష్కరణ
– తహశీల్దార్ రాఘవరెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ తునాం రోజా ప్రభుదాస్
తొర్రూరు : జూలై (జనంసాక్షి )
ప్రజా సేవలో ముందుండాలని తహసిల్దార్ ఎం రాఘవరెడ్డి, తొర్రూరు మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్ అన్నారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఆదివారం మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా దాతలు డిఎస్పి వెంకట రమణ, తహసిల్దార్ ఎం రాఘవరెడ్డి, తొర్రూరు మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాందాడి అశోక్ రెడ్డి గార్ల సహకారంతో పిట్రోల్ మెంటేనేస్ తో అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాల క్రితం ప్రజా సేవే లక్ష్యంగా ఏర్పడినటువంటి మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అంచలంచెలుగా ఎదగడం అభినందనీయం అన్నారు. కరోనా సమయంలో సంస్థ ప్రతినిధులు ప్రజలకు చేసిన సేవలు అమోఘమని అన్నారు. వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రతి ఇంటికి చేర్చారు. ప్రజా సేవే కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం వివిధ అంశాల పైన అవగాహన సదస్సులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని ఉన్నవారే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అరుదు, కానీ ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి సపోర్టు లేనప్పటికీ దృడ సంకల్పంతో ముందుకు పోతున్న మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో తోర్రూరు పరిసర ప్రాంతల ప్రజలకు అంబులెన్స్ తో పాటు ఇతర సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకురావాలని వారు అన్నారు. అనంతరం వార్షికోత్సవ సభ నిర్వహించి, కేక్ కటింగ్ చేసి దాతలను ఘనంగా సన్మానించారు. అనంతరం దాతలు రాఘవరెడ్డి, తూనం రోజా, అశోక్ రెడ్డి చేతుల మీదుగా అంబులెన్స్ వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందు మున్సిపల్ పట్టణ కేంద్రంలో సంస్థ ప్రతినిధులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు సిరికొండ విక్రమ్ కుమార్, వార్డ్ కౌన్సిలర్ తుర్పాటి సంగీత రవి, చకిలేల మనిరాజ్, మేకల కుమార్, తూనం శ్రావణ్, ముడుపు రవీందర్ రెడ్డి, కసోజూ శ్రీనివాస చారి, చీకటి శ్రీదర్, కోటగిరి సంతోష్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ReplyForward
|