ఘనంగా ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ జ‌న్మ‌దిన వేడుకలు…

రోగుల‌కు పండ్లు పంపిణీ చేసిన తెరాస నాయకులు…
ములుగు బ్యూరో,ఆగస్ట్20(జనం సాక్షి):-
జననేత ములుగు జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ జన్మదినం సందర్భంగా జడ్పీ భవన్ లో తెరాస ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ జగదీష్ సమేతంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భంగా ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహిస్తార‌ని ఆశించారు. ఈ కార్యక్రమంలో బాదం ప్రవీణ్ తో ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ ములుగు ఆత్మ కమిటీ చైర్మన్ చందా చక్రం ములుగు జిల్లా యువజన అధ్యక్షులు కోగిల మహేష్, ములుగు మండల యూత్ అధ్యక్షుడు బైకని సాగర్, ములుగు మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు రాజా హుస్సేన్,సీనియర్ నాయకులు గరిగే రఘు, చింతలపూడి నరేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్ మాదం సాగర్,నవీన్ మరియు పైడిమల్ల గోపి కృష్ణ, సర్వాపూర్ గ్రామ అధ్యక్షుడు అప్పాజీ, ఐలయ్య, దూడబోయిన శ్రీనివాస్, మరియు మహేందర్, ఆత్మ డైరెక్టర్ గడ్డం భద్రయ్య, ఇనగందుల వెంకటేష్, నాజర్ ఖాన్ సోలా రంగనాథ్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.