ఘనంగా విఎన్ఆర్ జన్మదిన వేడుకలు

టిఆర్ఎస్ నాయకుడు వంగ నర్సిహ్మ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలను అనాధ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు.అనాథలను ఆదుకోవటం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ నాయకులు వంగ నర్సింహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తుర్కపల్లి లోని సేవ్ ఆల్ రీచ్ ఆల్ అనాద ఆశ్రమంలో వృద్ధులు, పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో నర్సిహ్మ రెడ్డి,అఫ్జల్ ఖాన్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు… సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అనాద ఆశ్రమా లకు అండగా ఉండాలన్నారు. ఈ కార్య క్రమంలో అఫ్జల్ ఖాన్ , వంగ నర్సింహరెడ్డి తో పాటు శ్రీను, ఆశ్రమ సిబ్బంది, నాగయ్య,  పద్మ, తదితరులు పాల్గొన్నారు.
14 ఎస్పీటీ -1: పండ్లు పంచుతున్న నాయకులు