ఘనంగా శ్రీపాదరావు 78వ.జయంతి వేడుకలు
పేదలకు అన్నదానం, పండ్లు పంపిణీ
కరీంనగర్,మార్చి2(జనంసాక్షి): శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 78వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగినాయి. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయం హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. స్వర్గీయ శ్రీపాదరావు మారుమూల ప్రాంతమైన కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించి సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసనసభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారని అన్నారు. జిల్లాకు, రాష్టాన్రికి, ఎనలేని సేవచేశారని, రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచిన శ్రీపాదరావు నక్సల్స్ చేతిలో మరణించడం బాధాకరమని అన్నారు. శ్రీపాద ఆశయ సాధనకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం నగరంలోని శ్రీ పాదచౌక్ వద్ద గల శ్రీపాదవిగ్రహానికి పూలమాలలు వేసి, కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఆతరవాత అన్నదానం చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శర్మనగర్‌లోని ఆనంద నిలయంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి అడ్లూరి లక్ష్మన్ కుమార్ హాజరైనారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు ఇమ్రాన్, పోతారపు సురేందర్ లఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్ వద్ద పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఎన్‌ఎస్‌యుఐ నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో కార్కానగడ్డలోని వృద్దులు, వికలాంగుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి అడ్లూరి అక్ష్మన్‌కుమార్, టిపిసిసి అధికార ప్రతినిధి ఎం.స్వామినాధాచార్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, నిఖిల్ చక్రవర్తి, గందె మాధవి మహేష్, వి.అంజన్‌కుమార్, దిండిగాల మధు, న్యాతరి శ్యాంసుందర్, రహమత్ హుస్సేన్, ముల్కల ప్రవీణ్, మాదాసు శ్రీనివాస్, బొబ్బిలి విక్టర్, ఆకుల రాము, ఆయుబ్‌ఖాన్, మూల జైపాల్, రెడ్డవేని వినోద్, యం.డి. తాజ్, వెన్న రాజమల్లయ్య, ఖమ్రొద్దిన్, వి.గణెళిష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.