ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలు
ఆళ్లపల్లి ఆగస్టు 18 (జనం సాక్షి)
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు గురువారం ఆళ్లపల్లి ,మర్కోడు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో పాపన్న గౌడ్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ మంజు, భార్గవి జడ్పిటిసి కొమరం హనుమంతు, పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం గౌడ జెండాను గ్రామ గౌడ పెద్ద శ్రీరామ్ సమ్మయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ జడ్పిటిసి మాట్లాడుతూ…. ఆనాటి మొగలై అరాచక పాలన వారి ఆగడాలను వ్యతిరేకిస్తూ గెరిల్లా గలాన్ని ఏర్పాటు చేసుకొని అతి తక్కువ సమయంలో సుమారు పదివేల నుండి 12 వేల సైన్యాన్ని తయారుచేసి యుక్త విద్యలు నేర్పిన బహుజన రాజ్యాన్ని స్థాపించారని అన్నారు. అనంతరం వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, మర్కోడ్ గౌడ పెద్దలు తాళ్లపల్లి వెంకన్న మాట్లాడుతూ…. ఏజెన్సీలో ఎన్నో సంవత్సరాలుగా కళ్ళు గీత మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న గౌడ కులస్తులకు లైసెన్సులు ఇవ్వాలని ఐదు ఎకరాలలో తాటివనం,ఈతవనం ఏర్పాటు చేయాలని అర్హులైన గౌడ కులస్తులకు పెన్షన్ ఇవ్వాలని ,ఏజెన్సీలోని గౌడ కులస్తులను ఆదుకోవాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ పెద్దలు తాళ్లపల్లి రామ్మూర్తి రణం నారాయణ తాళ్లపల్లి నాగేష్ బూర్ణ రాంబాబు, బుర్ర వెంకన్న, తెలగాని శీను, తాళ్లపల్లి రవి తాళ్లపల్లి ,నవీన్, కంకటి ఐలయ్య తెలగాని పురుషోత్తం ,యూ డి సి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు