ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే
బీసీ యువసేన వ్యవస్థాపకుడు రామకృష్ణ రెడ్డి
కాకినాడ,జనవరి3(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా యువసేన ఆధ్వర్యంలో గురువారం తాటిపాక సెంటర్‌ లో సావిత్రి బాయిపూలే సభ నిర్వహించారు. ఈసందర్భంగా బీసీ యువసేన వ్యవస్థాపకుడు పెచ్చెట్టి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ..దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్ర బాయి పూలే  అని  కొనియాడారు. ఓ మహిళ తన నిర్ణయాలు తానే తీసుకోవాలంటే విద్య అవసరమని పేర్కొన్నారు. మహిళల విద్య కోసం 1948, జనవరి ఒకటవ తేదీ తొమ్మిది మంది విద్యార్థులతో పాఠశాల స్థాపించి బాలికల విద్యకు ఆధ్యులయ్యారని పేర్కొన్నారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయని, సమాజంలో అంటరానితనం, బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, మహిళలను చైతన్యవంతులను చేయడంలో ఆమె చేసిన కృషి మరువలేనిదన్నారు.ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకట రమణ, చెల్లుబోయిన రాంబాబు, చెల్లింగి శ్రీను, కాండ్రేగుల రాము యువసేన సభ్యులు పాల్గొన్నారు.