ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి
అదిలాబాద్ : నిర్మల్ – బైంసా జాతీయరహదారిపై శనిగాపూర్ శివారులో అదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిన్నారితో సహ ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న అటో, లారీ డీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో ఐదుగురు దుర్మరణం చెందగా. అసుపత్రిలో చికిత్స పోందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను భైంసా మండలం వానల్‌పాడు వాసులుగా గుర్తించారు. వీరంతా లక్ష్మణచాండ మండలం మల్లాపూర్ గ్రామంలో జరుగుతున్న సీమంత కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.