చండ్రుగొండ పంచాయతీలో వినూత్న ప్రయత్నం

*   పారిశుద్ధ్య పనులు  చేస్తూ ప్రచారం.
చండ్రుగొండ జనంసాక్షి (జూలై  31): సహజంగా వాహనాల్లో  సరదా  ప్రయాణాల కోసం, లేదా  పని సమయాల్లో అలసట తీరి   ఉత్సాహం గా పని చేసుకోవడం  కోసం  పాటలు వింటూ పనిచేస్తారు ప్రయాణాలు చేస్తారు.కానీ  చండ్రుగొండ   పంచాయితీలో మాత్రం అందుకు భిన్నంగా సీజనల్ వ్యాధుల పట్ల    తీసుకోవాల్సిన జాగ్రత్తల ను    అవగాహన కల్పిస్తూ పారిశుధ్య పనులకు శ్రీకారం చుట్టారు.  పంచాయతీ లో పనిచేసే  పారిశుద్ధ్య కార్మికులు ఒకవైపు చెత్తసేకరణను చేస్తూనే  మరోవైపు చెత్త సేకరించే ట్రాక్టర్లోని  టేపురికార్డర్ ద్వారా పరిసర ప్రాంతాల్లో చెత్తను  తొలగించాలని,  మురికి నీటి గుంటలు  లేకుండా చూసుకోవాలని పాత టైర్లు  కూలర్లలో నీటిని  తొలగించాలని,  వాటి ద్వారానే  దోమలు పెరిగి  విషజ్వరాలు ప్రబలుతున్నాయని  హెచ్చరిస్తూ  తమదైన శైలిలో  ప్రచారం నిర్వహిస్తున్నారు. తడి చెత్త పొడి చెత్తను  వేరు వేరుగా  ఉంచాలని  ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని  సూచనలు చేస్తూ  పలువురు ని ఆలోచింపజేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా  పంచాయితీ చేసే ప్రయత్నం అటు పంచాయితీ అధికారుల తో  పాటు ప్రజా ప్రతినిధులను  పారిశుధ్య కార్మికులను సైతం  ప్రజలు అభినందిస్తున్నారు.