చంద్రబాబుకు కలసిరాని జాతీయ రాజకీయాలు

బిజెపి వటవృక్షంగా ఎదగడంతో ప్రాంతీయపార్టీలకు గడ్డురోజులు

అమరావతి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): ఎన్‌డిఎ భాగస్వామ్యంలో ఉన్న ఎపికి విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. భాగస్వామిగా ఉన్నా సిఎం చంద్రబాబుకు ఎన్‌డిఎలో గతంలో లాగా చక్రం తిప్పే అవకాశం ఇవ్వకపోవడం, ఆడినట్లా మోడీ ఆడకపోవడంతో బయటకు వచ్చిన తరవాతల ఇప్పుడు పరిస్తితి మింగలేక క్కలేక అన్నట్లుగా తయారయ్యింది. జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో కుమ్మక్కయ్యారని చేస్తున్న విమర్శలు ఎదురుతుగులుతున్నాయి. ఎందుకంటే నాలుగేళ్లుగా అంటకాగింది బాబు మాత్రమే.వాజ్‌పేయ్‌ హయాంలో ఎక్కువకాలం ఢిల్లీలో ఉండి చక్రం తిప్పేవారు. ఎన్‌డిఎ కన్వీనర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలుగువెలిగిన బాబు ఇప్పుడు విడివడ్డ ఎపికే పరిమితం కావడం ద్వారా రాజకీయంగా కుంచించుకు పోయారు. దేశ రాజకీయాల్లో బాబు పాత్ర లేదన్న విషయం ఇప్పుడు స్పష్టం అవుతోంది. అందుకే మరోమారు ఆయన మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా అవసరమైతే కాంగ్రెస్‌తో పొత్తులకు సన్నద్దం అవుతున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడంతో బాబు రాజకీయ పాత్ర పరిమితంగా మారింది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకే పాత్ర లేని విధంగా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. బిజెపి మహావటవృక్షంలాగా విస్తరించడం చూస్తుంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గిపోతోంది. ఇకపోతే ఎపికి సంబంధించినంతవరకు ప్రత్యేక¬దా హావిూకాస్తా బుట్టదాఖలు అయ్యింది. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ తెరపైకి వచ్చినా అదో బ్రహ్మ పదార్థంలా ప్రజలకు అర్తం కాని విసయంగా ఉండిపోయింది. ఇకపోతే విశాఖ రైల్వేజోన్‌ మూలన పడింది. జోన్‌ ఎందుకు రైల్వే మంత్రినే ఇస్తున్నామని సురేశ్‌ ప్రభును ఎపి నుంచి గెలిపించారు. ఇప్పుడు ఆయనకున్న రైల్వేశాఖ ఇతరకుల బదిలీ అయ్యింది. దీంతో విశాఖ రైల్వే జోన్‌ వ్యవహారం కూడా అటకెక్కింది. అప్పట్లో, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రైల్వే జోన్‌ వచ్చేస్తుందని గట్టిగా వార్తలొచ్చాయి. విశాఖకు కాకుండా మరో ప్రాంతానికి ఆ రైల్వే జోన్‌ ఇవ్వాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఏ ప్రాంతానికీ రైల్వే జోన్‌ రాలేదు, విశాఖకు అసలే రాలేదు.. అఫ్పుడెలాంటి పరిస్థితులున్నాయో, ఇప్పుడూ అలాంటి పరిస్థితులే వున్నాయి. విశాఖకు రైల్వే జోన్‌ కోసం గట్టిగా పట్టుబట్టిన బీజేపీ నేతల్లో కంభంపాటి హరిబాబు చివరకు మంత్రి అవుతారనుకున్నా కాలం కలసి రాలేదు. మరోవైపు ఎపిలో ఇద్దరు ఎంపిలున్నా కేంద్రంలో స్థానం లేకుండా పోయింది. తెలంగాణలో ఒక్క ఎంపిగా ఉన్న దత్తాత్రేయ పదవిని లాగేసుకున్నారు. ఇలా తెలుగు ప్రజలకు కేంద్రంలో ప్రాతినిధ్యం అన్నది లేదు. గతేడాది విస్తరణలో మంత్రి పదవి ఆశించిన ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు భంగపడ్డారు. నరేంద్రమోడీ మాయలోపడి చాలామంది బిజెపిలో చేరినా ఎవరికి కూడా పదవీయోగం దక్కలేదు. వీరంతా ఏం చేయనున్నారన్నది ఇప్పుడే చెప్పలేం.రానున్న రోజుల్లో బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు జోరందుకోనున్నా ఆశ్చర్య పోనక్కరలేదు. చేరికలు ఎప్పుడూ హావిూలకు అనుగుణంగానే

ఉంటాయి. ఎపికి సంబంధించిన నేతలు తమ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

 

తాజావార్తలు