చంద్రబాబుతో దేవేందర్‌గౌడ్‌ భేటీ

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రచేస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కలిశారు. బాబుతో కొద్దిసేపు సమావేశమైన దేవేందర్‌గౌడ్‌ ఈ నెల 28న అఖిలపక్ష సమావేశంతో పాటు పాదయాత్ర గురించి చర్చించినట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం సహకరించకున్నా ప్రజా సమస్యలు పరిష్కారానికి పాదయాత్ర కోనసాగిస్తున్నారన్నారు. జిల్లాలో చంద్రబాబు తొమ్మిదో రోజు పాదయాత్ర కరీంనగర్‌ మండలం తీగలగుట్టనుంచి ప్రారంభమైంది. ఇక్కడి మహిళలు, స్థానికులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు మానకొండూరు నియోజకవర్గ తెదేపా నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలపై పోరాడాలని వారికి సూచించిచారు. ఇవాళ్లి యాత్ర జూబ్లీనగర్‌, ఛామన్‌పల్లి, దుబ్బపల్లి, చెర్లబుత్కూర్‌ మీదుగా సాగుతోంది.