చంద్రబాబును కలిసిన స్పీకర్‌ కోడెల

అమరావతి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన నివాసంలో సభాపతి కోడెల శివప్రసాదరావు సోమవారం సమావేశమయ్యారు. సాగర్‌ కుడి కాలువ ద్వారా పంటలకు నీటి విడుదల, అవయవ దానంపై మరింత అవగాహన, పంట తెగుళ్లు తదితర అంశాలను స్పీకర్‌ సీఎంతో చర్చించినట్లు తెలిసింది. ఈనెల 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున అందులో చర్చించాల్సిన పలు ప్రజా సమస్యలపైనా ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగినట్లు సమాచారం. సాగర్‌ కుడి కాలువ ద్వారా పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

తాజావార్తలు