చంద్రబాబును కలిసేందుకు వచ్చి నిరాశ
చిత్తూరు,సెప్టెంబర్1(జనం సాక్షి): చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా హెలిపాడ్ వద్దకు చేరుకున్న సిఎం చంద్రబాబును కలిసేందుకు కుప్పం, చిత్తూరుకు చెందిన కొందరు ముస్లిం నేతలు వినతిపత్రంతో వచ్చారు. అప్పటికే సమయం మించిపోవడంతో ప్రజాప్రతినిధులను తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు సీఎం వెళ్లాల్సిఉందని, ఇప్పటికే సమయం అయిపోవడంతో ఎవరినీ అనుమతించడం లేదని ఎస్పీ రాజశేఖరబాబు సర్దిచెప్పారు. అయినప్పటికీ పోలీసులను తోసుకుంటూ వారు హెలిపాడ్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా సీఎం ఛీఫ్ సెక్యూరిటీ అధికారి ఆగ్రహించడంతో వెనుదిరిగారు. కాగా, అమ్మవారి ప్రసాదాలు అందించేందుకు వచ్చిన వేలూరులోని గో/-డలెన్‌టెంపుల్ పీఆర్వో కళ్యాణ్‌నూ పోలీసులు అనుమతించలేదు.