చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే
– మోదీ నైతికతకు, బాబు అనైతికతకు చిహ్నం
– ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు
– ప్రభుత్వ పథకాల అవినీతిపై ఉద్యమం చేపడతాం
– బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
రాజమండ్రి, సెప్టెంబర్29(జనంసాక్షి) : మోదీ నైతికతకు.. చంద్రబాబు అనైతికతకు చిహ్నమని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని అన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేయటం వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాల్లో జరిగే అవినీతిపై ఉద్యమం చేపడతామన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై పెద్దఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. చివరికి మరుగుదొడ్ల నిర్మాణాల పథకంలోనూ అవినీతి
అక్రమలు చోటుచేసుకున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఫలితంగా తెదేపా నేతల అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. కేంద్రం రాష్ట్రాభివద్ధికి అనేక నిధులు కేటాయిస్తుందని, కానీ చంద్రబాబు అవి తీసుకుంటూనే కేంద్రం రాష్ట్రానికి ఏం చేయడం లేదని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా మోసం చేసే రకమని అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, సరియైన రీతిలో సరియైన సమాధానం చెప్పడం ఖాయమన్నారు.