చంద్రబాబు పాదయాత్ర ఖరారు

ఆదిలాబాద్‌,నవంబర్‌21: డిసెంబర్‌ 5 నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో చం ద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టనున్నారు. జిల్లాలోని ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల విూదుగా చంద్రబాబునాయుడు పాదయాత్ర సాగనుంది. మొత్తం ఏడు రోజుల్లో 145 కిలోవిూటర్లకుపైగా చంద్రాబాబునాయుడు పాదయాత్ర చేయనున్నారు.  టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా.. విూ కోసం కార్యక్రమం జిల్లాలో ఏడు రోజుల పాటు సాగనుంది. ఈ మేరకు రూట్‌మ్యాప్‌ ఖరారైంది. నిజామాబాద్‌ జిల్లా నుంచి జిల్లాకు చేరుకునే చంద్రబాబునాయుడు పాదయాత్ర పలు మండలాల విూదుగా సాగి కరీంనగర్‌ జిల్లాకు చేరుకుంటుంది.నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట మండలంలోని ఎంచ గ్రామం నుంచి డిసెంబర్‌ 4న రా త్రి చంద్రబాబునాయుడు పాదయాత్ర బాసరకు చేరుకుంటుంది. బాసరలో రాత్రి బస చేసి 5న ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం జిల్లాలో చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అదే రోజు ముథోల్‌ మండల కేంద్రానికి చేరుకుంటుంది. 6న బైంసా, 7న దిలావార్‌పూర్‌, 8న నిర్మల్‌ పట్టణానికి చేరుకుంటుంది. 9న లక్ష్మణచందా, 10న మామడ, 11న ఖానాపూర్‌కు చేరుకుంటుంది. 11న రాత్రి ఖానాపూర్‌లో చం ద్రబాబునాయుడు బస చేసి 12న ఉదయం కరీంనగర్‌ జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి బయలుదేరుతారు. రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసేందుకు టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, బోథ్‌ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.నగేశ్‌ ఆయా ప్రాంతాల టీడీపీ నేతలతో చర్చించారు. డిసెంబర్‌ 5న నిజామాబాద్‌ జిల్లాలో పాదయాత్ర ముగించుకొని బాసర వద్ద జిల్లాలో ప్రవేశిస్తుందన్నారు. ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజక వర్గాల్లో ఏడు రోజుల పాటు- ఈ పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు.రైతులు ,కూలీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ కులాల వారు అన్ని వర్గాల వారు పాదయాత్రకు హజరై తమ సమస్యలను పార్టీ అధినేత చంద్రబాబుకు స్వయంగా విన్నవించే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయడానికి పాదయాత్రతో చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తున్నారని వివరించారు.  ప్రజలు ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంతో కొన్ని పార్టీలు రాజకీయంగా లబ్ధిపొందితే టీడీపీ మాత్రం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 5న పాదయాత్ర రాత్రి ఆలస్యం అయితే ముందు జాగ్రత్తగా బాసరలో నాయకులు బస చేసేందుకు వీలుగా గోదావరి రహదారి పక్కన స్థలాన్ని పరిశీలించారు.