చంద్రబాబు వైఖరి వల్లే.. : వేణుగోపాలాచారి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (): తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించడం వల్ల ఆ పార్టీని వీడానని ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు తన నియోజకవర్గంలో తనపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీ స్పష్టమైన వైఖరి అవలంభించకపోవడం పార్టీ నాయకులు, అధినేత రెండు రకాలుగా మాట్లాడడంతో మనస్థాపం చెంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నానని వేణుగోపాలచారి వివరించారు. తెలుగుదేశం ఆవిర్భాంలోనే ఎన్టీఆర్‌ నాయకత్వంలో 1982లో పార్టీలో చేరానని చంద్రబాబు 1985 పార్టీలో చేరిన విషయాన్ని  విస్మరించరాదన్నారు. తాను చేసిన సేవలకు ప్రజలు తనకు పదవులు అప్పజెప్పారని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా రాష్ట్రాన్ని, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. కేవలం రాజకీయ కోణంలో తనపై విమర్శలు, ఆరోపణలు చేయడం పత్రిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు తగదన్నారు.